బ్లూ ఫిల్మ్స్ సీడీలు అమ్ముతున్న మహిళ అరెస్ట్ | woman arrested due to selling of blue films | Sakshi
Sakshi News home page

బ్లూ ఫిల్మ్స్ సీడీలు అమ్ముతున్న మహిళ అరెస్ట్

Jan 6 2016 10:37 PM | Updated on Apr 3 2019 4:43 PM

బ్లూ ఫిల్మ్స్ సీడీలు అమ్ముతున్న మహిళ అరెస్ట్ - Sakshi

బ్లూ ఫిల్మ్స్ సీడీలు అమ్ముతున్న మహిళ అరెస్ట్

జీడిమెట్ల పోలీసులు బుధవారం ఓ దుకాణంపై దాడి చేసి పైరేటెడ్ సీడీలను స్వాధీనం చేసుకుని ఒకరిని రిమాండ్ తరలించారు.

జీడిమెట్ల: జీడిమెట్ల పోలీసులు బుధవారం ఓ దుకాణంపై దాడి చేసి పైరేటెడ్ సీడీలను స్వాధీనం చేసుకుని ఒకరిని రిమాండ్ తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన మహేశ్వరి (30) స్థానికంగా ఎస్‌ఎస్ మ్యూజికల్స్ దుకాణం నిర్వహిస్తోంది. పైరసీ సీడీలతో పాటు బ్లూ ఫిల్మ్ సీడీలు కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

తమ వద్ద ఉన్న సమాచారం మేరకు బుధవారం జీడిమెట్ల పోలీసులు దుకాణంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో 117 పైరసీ సీడీలు దొరకగా వాటిలో 5 కొత్త సినిమాలు, మిగిలినవి అశ్లీల చిత్రాలుగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకురాలు మహేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement