వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి | Water tanker killed a child | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి

Apr 21 2016 12:55 PM | Updated on Sep 4 2018 5:21 PM

వాటర్ ట్యాంకర్ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది.

వాటర్ ట్యాంకర్ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని శేర్‌లింగంపల్లి చౌరస్తా వద్ద గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ రోడ్డు మీద ఉన్న చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడిక క్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement