'చేతికేమీ చిక్కలేదని, బైక్స్ తగులపెట్టాడు' | theft attempt in meerpet | Sakshi
Sakshi News home page

'చేతికేమీ చిక్కలేదని, బైక్స్ తగులపెట్టాడు'

Feb 1 2014 1:16 PM | Updated on Aug 30 2018 5:27 PM

హైదరాబాద్ మీర్‌పేట్‌లో శ్రీను అనే దొంగ ఈరోజు అర్థరాత్రి హల్‌చల్ చేశాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ మీర్‌పేట్‌లో శ్రీను అనే దొంగ ఈరోజు అర్థరాత్రి హల్‌చల్ చేశాడు. అన్నపూర్ణ కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీకి యత్నించి విఫలం అయ్యాడు. చేతికి ఏమీ చిక్కలేదని తిక్కరేగిందేమో ఎదురుగా కనిపించిన రెండు మోటార్‌ బైక్స్‌ను తగులబెట్టాడు. మంటల ధాటికి అక్కడే ఉన్న ఒక కారు కూడా కాస్త దెబ్బతింది. పొగ వాసనకు బయటకు వచ్చిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడే అనుమానంగా తిరుగుతున్న శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement