సాక్షి స్పెల్‌బీ ఏపీ విజేతలు వీరే | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీ ఏపీ విజేతలు వీరే

Published Sun, Jan 3 2016 5:06 AM

సాక్షి స్పెల్‌బీ ఏపీ విజేతలు వీరే - Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు  సంబంధించి నాలుగు  కేటగిరీల్లో విజేతల 
 ఏపీ చాంప్‌గా నిలిచిన రాజమండ్రి ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్’
 విజ్ఞాన్ యూనివర్సిటీ  సహకారంతో నిర్వహణ
 
 సాక్షి, హైదరాబాద్: విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారంతో సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ ఫైనల్ పోటీల విజేతలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ చాంపియన్ స్కూల్ గా ట్రిప్స్ ఇంటర్నేషన్‌ల్ స్కూల్, రాజ మండ్రి నిలిచింది. ఇక స్పెల్‌బీ నాలుగు కేటగిరీల్లో ఫైనల్స్ విజేతలను వెల్లడించారు. బంగారు పతకం విజేతకు రూ. 25 వేలు, వెండి పతకం విజేతకు రూ. 15 వేలు, కాంస్య పతకం విజేతకు రూ. 10 వేలు బహుమతిగా అందజేశారు.
 
  ప్రతీ కేటగిరీ నుంచి 20 మంది పోటీ పడగా.. ముగ్గురు విజేతలుగా నిలిచారు. సాక్షి మీడియా గ్రూప్ డెరైక్టర్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణి రెడ్డి, సాక్షి డెరైక్టర్(అడ్మిన్ అండ్ ఫైనాన్స్) వై.ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. స్పెల్ బీ పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మెడల్, సర్టిఫికెట్లను అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన స్పెల్‌బీ ఫైనల్స్ శనివారం సాయంత్రం సాక్షి టీవీలో ప్రసారమయ్యాయి. ఇక తెలంగాణకు సంబంధించిన ఫైనల్ పోటీలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాక్షి టీవీలో ప్రసారం కానున్నాయి.
 
 
 కేటగిరీల వారీగా విజేతల వివరాలు 
 కేటగిరీ 1 విజేతలు: బంగారు పతకం విజేత-కె. జయసూర్యరెడ్డి, విశ్వభారతి స్కూల్, అనంతపురం
 వెండి పతకం విజేత-డీఎస్ సహజ, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి. కాంస్య పతకం విజేత-రోహిత్, ఓవెల్ స్కూల్, నెల్లూరు
 
 కేటగిరీ 2 విజేతలు: బంగారు పతకం విజేత-ప్రేమ్ జైన్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి. వెండి పతకం విజేత-టి.నికిత, డాఫ్నీ ఏషియాటిక్ స్కూల్, రాజమండ్రి. కాంస్య పతకం విజేత-ఎం.గాయత్రి, ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమండ్రి
 
 కేటగిరీ 3 విజేతలు: బంగారు పతకం విజేత-కె.సాయితేజారెడ్డి, కాంఫోర్డ్ స్కూల్(ఈస్ట్), చిత్తూరు
 వెండి పతకం విజేత-ఎం.శ్రీపవన్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి. కాంస్య పతకం విజేత-ఎంజేఎల్‌ఎస్ శ్రీజ, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి
 
 కేటగిరీ 4 విజేతలు: బంగారు పతకం విజేత-డి.ఆశాశ్రీ, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి. వెండి పతకం విజేత-ఆనందితా విశ్వనాథం, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి. కాంస్య పతకం విజేత-వైష్ణవీ ఎస్ హేమదేవ్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి

Advertisement
Advertisement