ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి | judicial inquiry should probe on police suicides | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి

Sep 2 2016 3:12 AM | Updated on Aug 21 2018 8:14 PM

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి - Sakshi

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి

పోలీసు శాఖలో వరుసగా జరుగుతున్న ఎస్‌ఐల ఆత్మహత్యలపై శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని...

ఎస్‌ఐల ఆత్మహత్యలపై చాడ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో వరుసగా జరుగుతున్న ఎస్‌ఐల ఆత్మహత్యలపై శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆ శాఖలో పెరుగుతున్న ఒత్తిళ్లు, అధికార, రాజకీయ జోక్యం, మామూళ్ల విష సంస్కృతి వంటి సమస్యలను పరిష్కరించి ప్రక్షాళన చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహజంగానే పోలీసుశాఖలో పని ఒత్తిడి ఉంటుందని, అయితే యువ ఎస్‌లు బలికావడం ఆ శాఖకు కళంకమన్నారు. శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. కార్మిక రంగ సమస్యలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై చేపట్టిన సమ్మెకు అన్ని రంగాల ప్రజలు సహకరించాలని చాడ  కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement