హైదరాబాద్ బెస్ట్ సిటీ | Hyderabad Best City :BP Acharya | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బెస్ట్ సిటీ

Jun 12 2015 1:23 AM | Updated on Aug 27 2019 4:33 PM

హైదరాబాద్ బెస్ట్ సిటీ - Sakshi

హైదరాబాద్ బెస్ట్ సిటీ

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకరంగం ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు.

కెనడా రోడ్‌షోలో బీపీ ఆచార్య
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకరంగం ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్‌లో బుధవారం నిర్వహించిన టూరిజం రోడ్‌షోలో బీపీ ఆచార్య ప్రసంగించారు.

ప్రఖ్యాత నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైన్‌లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ రెండో నగరంగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ టూరిజం కార్యాలయంతో పాటు పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ఇండియా శాఖ సంయుక్తంగా ఈ రోడ్‌షోను నిర్వహించాయి. ఉత్తర అమెరికాలోని పలువురు టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement