విమలక్క కేసు వాయిదా | high court hearing on arunodaya vimalakka petition | Sakshi
Sakshi News home page

విమలక్క కేసు వాయిదా

Dec 7 2016 12:53 PM | Updated on Aug 31 2018 8:31 PM

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేసు వాయిదా పడింది.

హైదరాబాద్‌: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేసు వాయిదా పడింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యాలయాన్ని ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా పోలీసులు సీజ్ చేయడాన్ని, తనపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందంటూ హైకోర్టులో విమలక్క పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement