ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు | elections in the RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు

Jul 18 2016 6:29 PM | Updated on Aug 14 2018 5:56 PM

ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు - Sakshi

ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు

తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 194 డిపోల్లో సుమారు 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలలో 14 యూనియన్లు పోటీపడుతున్నాయి. మెజారిటీ డిపోలను గెలుపొందిన యూనియన్‌లకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించనుంది. దీంతో డిపోల వారీగా యూనియన్లను గెలిపించుకునేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీ ప్రధానంగా మూడు యూనియన్ల మధ్య ఉంది..నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఓటింగ్ అనంతరం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. డిపోల వారీగా లెక్కింపు జరిగిన వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement