పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు | Complaint against pawan kalyan on caste comments | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు

Aug 30 2016 6:06 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు - Sakshi

పవన్ కల్యాణ్ పై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు

జనసేన అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ పై ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ : కుల మతాలను కించపరిచే విధంగా తిరుపతి సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్  జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల క్రితం తాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా తిరస్కరించారని ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుల మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని ప్రత్యక్షంగా సభలో మాట్లాడటం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement