తప్పిపోయిన పోలీస్‌ అధికారి | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన పోలీస్‌ అధికారి

Published Tue, Sep 19 2017 10:12 PM

తప్పిపోయిన పోలీస్‌ అధికారి - Sakshi

హైదరాబాద్‌: నగరంలో ఓ పోలీసు అధికారి తప్పిపోయారు. అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎసైగా విధులు నిర్వహిస్తున్న హనుమంత రాయప్ప నిన్నిటి నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాయప్పకు గత రెండు నెలలుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన భార్య దగ్గరుండి విధులకు తీసుకెళ్తుంది.  నిన్న మధ్యాహ్నం విధులకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయప్ప నిన్న విధులకు హజరు కాలేదని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement