మరో 4 రోజుల పాటు వర్షాలు | another 4 days rains in telangana | Sakshi
Sakshi News home page

మరో 4 రోజుల పాటు వర్షాలు

May 8 2016 10:41 AM | Updated on Sep 3 2017 11:41 PM

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితలం ఆవర్తనం ఏర్పడి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితలం ఆవర్తనం ఏర్పడి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగురోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతోంటే... మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement