కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం సీజ్ | Adulterated oil seized in malakpet | Sakshi
Sakshi News home page

కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం సీజ్

Nov 23 2016 4:36 PM | Updated on Sep 17 2018 6:26 PM

కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్: కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మలక్‌పేట్‌లో కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రంపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 750 లీటర్ల కల్తీ నూనెతో పాటు తయారీకి వాడే యంత్రాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

Advertisement
 
Advertisement
Advertisement