శుక్లాలకు చుక్కల మందు! | Scientists have developed an eye drop that can dissolve cataracts | Sakshi
Sakshi News home page

శుక్లాలకు చుక్కల మందు!

Jul 26 2015 3:08 AM | Updated on Sep 3 2017 6:09 AM

శుక్లాలకు చుక్కల మందు!

శుక్లాలకు చుక్కల మందు!

వయసు మీదపడుతున్న కొద్దీ చూపు మందగించడం, కొంతమందిలో కంటి శుక్లాలు ఏర్పడటం మనం చూస్తూనే ఉంటాం.

వయసు మీదపడుతున్న కొద్దీ చూపు మందగించడం, కొంతమందిలో కంటి శుక్లాలు ఏర్పడటం మనం చూస్తూనే ఉంటాం. చత్వారాన్ని కళ్లజోడుతో సరిచేసుకోవచ్చునేమోగానీ... శుక్లాలకు మాత్రం శస్త్రచికిత్సకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ పరిస్థితి త్వరలోనే మారిపోతుందని అంటున్నారు చైనాలోని సన్ యాట్ సేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ప్రకృతిలో లభించే ఓ రసాయనాన్ని చుక్కల మందుగా వాడటం ద్వారా శుక్లాలను కరిగించే రోజు ఎంతో దూరంలో లేదని వీరు చెబుతున్నారు.

లానో స్టెరాల్‌పై జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ రసాయనం శుక్లాల ప్రొటీన్లు ఒకదగ్గర గుమికూడకుండా అడ్డుకుంటుందనీ, కుక్కలపై దీన్ని  ఉపయోగించినప్పుడు ఆరువారాల్లోనే వాటి కంటి శుక్లాలు గణనీయంగా తగ్గాయనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement