ఖానాదానీ | kukatpally sujanamal | Sakshi
Sakshi News home page

ఖానాదానీ

Mar 13 2015 3:12 AM | Updated on Aug 21 2018 2:46 PM

ఖానాదానీ - Sakshi

ఖానాదానీ

రాజస్థానీ, గుజరాతీ వంటకాలు నగరవాసులకు మరింత చేరువయ్యాయి.

రాజస్థానీ, గుజరాతీ వంటకాలు నగరవాసులకు మరింత చేరువయ్యాయి. దేశంలోనే పేరెన్నికగన్న వెజిటేరియన్ రెస్టారెంట్ చైన్ ‘ఖాన్‌దానీ రాజధాని’ కూకట్‌పల్లి సుజనామాల్‌లో గురువారం రెండో అవుట్‌లెట్ ప్రారంభించింది. ఆహ్లాదకరమైన ఇంటీరియర్... పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన చెఫ్‌లు వండి వార్చే నోరూరించే రుచులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

లంచ్, డిన్నర్స్‌లో మట్టర్ ఖాస్తా రోల్, సుర్తి ప్లాజా, బర్సాడొల్లా, హరివాలిపత్ర, జోధ్‌పురి పకోడా వంటి వెరైటీస్‌తో పాటు సూరతి ఉందియ, జైసల్మార్ పాంచ్ కుటా, పిథోడ్ కీ సబ్జీ, జోధ్‌పురి గట్టా, సాంగ్రి కీ కోఫ్టె, రాబోది హరాప్యాజ్, తిల్‌వాలే వంటి సబ్జీలను ఇక్కడ వేడివేడిగా లాగించేయచ్చు. అంతేకాదు చిల్లీసేవ్ పూరీ, టోక్రీ దహీ చాట్, డబెలీ, టమాటా, అక్రూట్ హల్వా, దూద్‌ప్యాక్ తదితర శ్నాక్స్ కూడా ఈ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement