మూవీ బుజ్ | Bolly wood Movie Buzz | Sakshi
Sakshi News home page

మూవీ బుజ్

Jul 3 2014 2:36 AM | Updated on Sep 2 2017 9:42 AM

మూవీ బుజ్

మూవీ బుజ్

ఇదివరకు పెటాకులైన పెళ్లిళ్లు, సహజీవన భాగస్వాములతో తలెత్తిన పొరపొచ్చాలు లవ్వాటలో తనను మరింత తెలివిగా మార్చాయని పాప్ గాయని జెన్నిఫెర్ లోపెజ్ చెబుతోంది.

లవ్వాటలో లోపెజ్ తెలివి
 ఇదివరకు పెటాకులైన పెళ్లిళ్లు, సహజీవన భాగస్వాములతో తలెత్తిన పొరపొచ్చాలు లవ్వాటలో తనను మరింత తెలివిగా మార్చాయని పాప్ గాయని జెన్నిఫెర్ లోపెజ్ చెబుతోంది. గడచిన రెండేళ్లుగా కాస్పెర్ స్మార్‌‌టతో సహజీవనం సాగించిన లోపెజ్, ఇటీవలే అతగాడితో అనుబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అయితే, ఇదివరకటి కంటే ఎక్కువగా తానిప్పుడు ప్రేమను నమ్ముతున్నానని, ప్రేమ విషయంలో ఇప్పుడు తాను కాస్త తెలివిగా మారానని అంటోంది.
 
 సల్మాన్ సరిగమ...

 కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి గొంతు సవరించుకున్నాడు. హ్యాంగ్‌ఓవర్ సినిమా కోసం సల్మాన్
 గళమెత్తాడు. శ్రేయాగోషాల్‌తో కలిసి యుగళ గీతం ఆలపించాడు. ఇప్పటి వరకు డజనుకు పైగా పాటలకు గాత్రం అందించిన ఈ ‘బాడీగార్డ్’ తాజాగా మరోసారి రాగం ఎత్తుకున్నాడు.  
 
 నన్నొదిలేయండి ప్లీజ్
 బాలీవుడ్‌లో షార్ట్ పిరియడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించిన రణవీర్ సింగ్ ఇప్పుడు తలపట్టుకుంటున్నాడు. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్‌తో మనోడికి పిచ్చెక్కుతోందట. కో స్టార్లతో లింకప్‌లు, బ్రేకప్‌లతో మస్త్ మసాలా పంచుతున్న యంగ్ హీరో.. నన్నొదిలేయండి ప్లీజ్ అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement