వేసవి వ్యాధులు... హోమియో పరిష్కారాలు

వేసవి వ్యాధులు... హోమియో పరిష్కారాలు


హోమియో కౌన్సెలింగ్‌

నా పేరు అనిల్‌కుమార్‌. వయసు 35 ఏళ్లు. మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తున్నాను. ఎండలో కొంతసేపు తిరిగిన వెంటనే నోరు తడి ఆరిపోతోంది. చెమటలు పడుతున్నాయి. తల తిరిగినట్లు అవుతోంది. దీనికి ముందుజాగ్రత్తలు చెప్పండి. అలాగే హోమియోలో వేసవి సమస్యలకు ఏవైనా పరిష్కారాలు ఉంటే సూచించండి. – సురేందర్‌రావు, వరంగల్‌

వేడికి నీరు ఎలా ఆవిరవుతుందో, వాతావరణంలో ఎండ వల్ల వేడిమి పెరిగేకొద్దీ మన శరీరంలోని నీరు కూడా అలాగే ఆవిరి అవుతుంది. ఎండాకాలంలో పెద్దవారు, చిన్నపిల్లలు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతారు. మనం చెమట రూపంలో ఆవిరయ్యే నీటితో పాటు, సోడియమ్, పొటాషియమ్‌ మొదలైన లవణాలు కూడా నష్టపోతుంటాం. మిగతా కాలాల్లో కంటే వేసవిలో చెమట రూపంలో రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీటిని కోల్పోతుంటాం. ఎండలో తిరిగితే ఎండ దెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండదెబ్బ అనేది హఠాత్తుగా జరగదు. ఆరోగ్యం మీద ఎండ ప్రభావం దశలవారీగా ప్రభావం చూపుతూ, చివరికి ఎండ దెబ్బకు దారితీస్తుంది. ఆ దశలు ... 1) అలసట; 2) హీట్‌ ఎగ్జాషన్‌; 3) హీట్‌ స్ట్రోక్‌. వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.వడదెబ్బ తగిలిన వృద్ధులు, మహిళలు, చిన్నారు, విద్యార్థులు హోమియో మందులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... వడదెబ్బ, చికెన్‌పాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీ, చెమటకురుపులు, తలనొప్పి, ఆకలి మందగించడం, టైఫాయిడ్, నీళ్ల విరేచనాలు, మూత్ర సంబంధ వ్యాధులు, కలరా మొదలైనవి.

కారణాలు: ∙కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ∙ఎండల్లో ఎక్కువగా తిరగడం ∙మద్యం సేవించడం ∙బయట కొన్న పదార్థాలు తినడం ∙తీవ్ర ఒత్తిడికి లోనుకావడంలక్షణాలు: ∙నీరసం, తల తిరగడం ∙సొమ్మసిల్లి పడిపోవడం ∙ఒంటినొప్పులు, తలనొప్పి ∙హైఫీవర్, వాంతులు ∙మూత్రం గాఢమైన పసుపురంగులో ఉండి మంటగా రావడం.చికిత్స: వడదెబ్బతో పాటు ఎండాకాలంలో వచే ఇతర వ్యాధులకు హోమియోలో అద్భుతమైన మందులు ఉన్నాయి. వేసవిలో వచ్చే వ్యాధులకు నేట్రమ్‌మ్యూర్, బెల్లడోనా, ఆర్సినిక్‌ ఆల్బ్‌ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రత, లక్షణాలతో పాటు ఇతర వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల పర్యవేక్షణలోమందులు వాడాల్సి ఉంటుంది.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)

స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌
తిరగబెట్టే అవకాశాలు తక్కువే..!

క్యాన్సర్‌ కౌన్సెలింగ్‌


క్యాన్సర్‌ ఉన్న శరీర భాగాన్ని తొలగించివేసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయా? నా భార్య (36 ఏళ్లు)కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్‌ చేస్తే క్యాన్సర్‌ ఉన్న ఎడమ రొమ్మును తొలగించి వేస్తారని, అయినప్పటికీ మళ్లీ శరీరంలోని మరో చోట క్యాన్సర్‌ వస్తుందేమోనని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోవడం లేదు. బ్రెస్ట్‌క్యాన్సర్‌ వస్తే తప్పనిసరిగా ఆ రొమ్మును తీసివేయాల్సిందేనా? దీనివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుందా? హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుందా? వేరే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా తెలపండి.

– మనోజ్‌కుమార్, హైదరాబాద్‌


శస్త్రచికిత్స చేసి క్యాన్సర్‌ సోకిన భాగాన్ని తొలగించివేసిన తర్వాత మళ్లీ క్యాన్సర్‌ రాదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఆపరేషన్‌ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్‌ కణాలు సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. రొమ్ము క్యాన్సర్‌ సర్జరీ తర్వాత ఆ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల రేడియేషన్‌తో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా చేయడం ద్వారా ఆ ప్రదేశంలో మళ్లీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చినట్టు గుర్తించారు. అయితే ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం మాత్రం ఇక దాదాపుగా ఉండదు. రెండు అండావయాలను తొలగించి వేసిన మహిళల్లో ఒవేరియన్‌ క్యాన్సర్‌ మరణాలు 80 శాతం తగ్గిపోయినట్టు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తెలిసింది.ఇక బ్రెస్ట్‌ క్యాన్సర్‌లో రొమ్మును తొలగించివేయడంపైన చాలా అపోహలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. క్యాన్సర్‌ సోకినప్పుడు పూర్తి రొమ్మును తొలగిఒచడం చాలా అరుదుగా జరుగుతుంది. రోగ నిర్ధారణ పరీక్షలపై ఆధారపడి క్యాన్సర్‌ సోకిన భాగాన్ని మాత్రమే తొలగిస్తాం. దాని వల్ల రూపం చెడకుండా, గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో శరీరంలోని మరో చోటి నుంచి కొంత భాగాన్ని తెచ్చి పార్షియల్‌ ఫిల్లింగ్‌ ద్వారా భర్తీ చేస్తాం. తర్వాత సాధారణ రూపంలో పోలిస్తే రొమ్ములో పెద్దగా తేడా కనిపించదు. మొత్తంగా రొమ్మును తీసివేయడం వల్ల మహిళ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఆమె మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌)కు గురికావచ్చు. కానీ రొమ్మును తొలగించడం శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలను ఏమీ ప్రభావితం చేయదు. ఇది సాధారణ వైవాహిక జీవితంపై ప్రభావం కూడా చూపదు. మంచి సర్జికల్‌ ఆంకాలజిస్టులను కలవండి. ఆ నిపుణులు సహాయపడగలరు. మేము స్టేజ్‌ 1, స్టేజ్‌2, కొన్నిసార్లు స్టేజ్‌3 స్థాయిలో ఉన్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రోగులకు కూడా చికిత్స చేస్తున్నాం. మీ భార్య భయపడుతున్న పరిణామాలు ఏమీ ఎదురవ్వలేదు. అందువల్ల ఆందోళన పడవద్దని చెప్పండి. ఆమె భయపడుతున్నట్లు ఏమీ జరగదు.

డాక్టర్‌ కె. శ్రీకాంత్‌ సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌
తగిన జాగ్రత్తలతో... ఫిస్టులా తగ్గుతుంది

ఫిస్టులా కౌన్సెలింగ్‌


నా వయసు 42 ఏళ్లు. గత మూడు నెలలుగా మలద్వారం చుట్టూ విపరీతమైన నొప్పి వస్తోంది. కుర్చీ మీద కూర్చోలేకపోతున్నాను. మలద్వారం వద్ద బుడిపె ఏర్పడి అందులోంచి చీము స్రవిస్తోంది. అప్పుడప్పుడూ జ్వరం కూడా వస్తోంది. దీనికి చికిత్స మార్గాలు చెప్పండి.

– సందీప్‌కుమార్, నిర్మల్‌


మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే దీర్ఘకాలికంగా మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా దీని లక్షణాల్లో భాగంగా మలద్వారం సమీపంలో ఒక చిన్న బుడిపె ఏర్పడుతుంద. ఆ బుడిపె మధ్య భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం నుంచి తరచు చీము, రక్తం వస్తుంటాయి. దీన్ని ఫిస్టులా అంటారు. కొన్నిసార్లు ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం పూడుకుపోయి లోపల చీము, రక్తం నిల్వ ఉండిపోయి... నొప్పి వస్తుంటుంది. ఈ టైంలో జ్వరం కూడా రావచ్చు.చికిత్స: ఫిస్టులా అన్నది సాధారణంగా మందులతో నయం చేయలేని వ్యాధి. దీన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అయితే కొన్ని జాగ్రత్తలతో దీన్ని రాకుండా నివారించవచ్చు.నివారణ: n మలబద్దకం లేకుండా చూసుకోవాలి n ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి n ఇలా చేయడం ద్వారా మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. తద్వారా పరిస్థితి ఫిస్టులా వరకు వెళ్లకుండా జాగ్రత్త వహించవచ్చు n పరిశుభ్రమైన లో దుస్తులు (అండర్‌వేర్‌)లు మాత్రమే ధరించాలి n డ్రైవింగ్‌ ఎక్కువగా చేసేవారు లేదా ఆ వృత్తిలో ఉన్నవారు మలద్వార ప్రాంతాన్ని ఎప్పుడూ బట్టలతో కప్పివేసి ఉంచేలా కాకుండా... అక్కడ గాలి తగులుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి n  గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, ఎండలో శ్రమించేవారు చెమట రూపంలో నీటిని ఎక్కువగా కోల్పోతుంటారు. ఈ కారణంగా కూడా మలబద్దకం రావచ్చు. ఇలాంటివాళ్లు తగినంత మంచినీటిని తాగుతూ ఉండటం ద్వారా మలబద్దకం సమస్యను నివారించుకోవచ్చు. మలబద్దకమే ఫిస్టులా సమస్యకు ప్రధానమైన మూలకారణం అయినందువల్ల... ముందుగా మలబద్దకాన్ని నివారించుకుంటే ఫిస్టులాను నివారించినట్లే అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి.

డా‘‘ఎమ్‌.ఏ.సలీమ్‌

సీనియర్‌ కన్సల్టెంట్‌

జనరల్‌ సర్జరీ
కేర్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌

Back to Top