నవంబర్ 2 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 2, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 2 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 1 2015 10:40 PM | Updated on Sep 3 2017 11:50 AM

నవంబర్  2 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 2 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
 షారూఖ్ ఖాన్ (నటుడు), అను మాలిక్ (సంగీత దర్శకుడు)

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి వీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, ఊహాశక్తి పుట్టుకతోనే వస్తాయి. ఈ సంవత్సరం గురు చంద్రుల కలయిక వల్ల చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు.

 లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు.
 సూచనలు: అనాథాశ్రమాలు/ దేవాలయాలు/ చర్చిలు/ మదరసాలకు బియ్యాన్ని విరాళంగా ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారికి ప్రేమతో పాయసం తినిపించడం,  పండితులను, మతగురువులను గౌరవించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
  ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement