యువత మెచ్చిన... మోక్ష | moksa is favored by young people ... | Sakshi
Sakshi News home page

యువత మెచ్చిన... మోక్ష

Mar 6 2014 12:10 AM | Updated on Aug 1 2018 2:36 PM

యువత మెచ్చిన... మోక్ష - Sakshi

యువత మెచ్చిన... మోక్ష

ఇప్పుడు నేపాల్‌లో ఏ ఇద్దరు యువకులు మాట్లాడుకున్నా, వాళ్ల సంభాషణలో ‘మోక్ష’ సినిమా ప్రస్తావన తప్పనిసరిగా మారింది.

ఇప్పుడు నేపాల్‌లో ఏ ఇద్దరు యువకులు మాట్లాడుకున్నా, వాళ్ల సంభాషణలో ‘మోక్ష’ సినిమా ప్రస్తావన తప్పనిసరిగా మారింది. క్లాస్‌రూమ్, కాలేజి క్యాంటీన్‌లలో ఈ సినిమా గురించి హాటు హాటు, స్వీటు స్వీటు చర్చలు నడుస్తున్నాయి. యువత నుంచి మాత్రమే కాకుండా నేపాల్ సీనియర్ సినీ విమర్శకుల నుంచి కూడా ‘మోక్ష’కు  ప్రశంసలు లభిస్తున్నాయి.  ‘‘యువతరం తప్పనిసరిగా చూడాల్సి సినిమా ఇది’’ అంటున్నారు వాళ్లు.
 
ప్రబిన్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రం పట్టణ యువత జీవితాన్ని ఆవిష్కరించింది. కోసిస్, బెనిష ప్రధాన పాత్రలు  పోషించిన ఈ చిత్రం ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. కోసిస్ తన మిత్రులతో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్‌ను  ఏర్పాటు చేస్తాడు. అది బాగా పాపులర్ అవుతుంది. ఈ పరిణామం ఆ యువకుల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది? అనే విషయాన్ని దర్శకుడు ప్రతిభావంతంగా చిత్రించాడు.
 
యూత్ సినిమా అనగానే...నాలుగు బూతు జోకులు, పంచ్ డైలాగులు... ఇలా ఒక ఫార్ములా ఉంటుంది. ఈ సినిమా మాత్రం ఆ ఫార్ములాకు దూరంగా ఉంటూనే, విజయం సాధించింది. వీలైతే మీరూ చూసి ఆనందించండి.
 

Advertisement
 
Advertisement
Advertisement