బ్యూటిప్స్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Apr 6 2017 12:05 AM | Updated on Apr 3 2019 4:08 PM

బ్యూటిప్స్‌ - Sakshi

బ్యూటిప్స్‌

రెండు బాదంపప్పులను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేసి అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ ముల్తానిమట్టి, పుచ్చకాయ

రెండు బాదంపప్పులను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేసి అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ ముల్తానిమట్టి, పుచ్చకాయ రసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఫలితాలివి... బాదంపప్పు చర్మానికి మంచి పోషణనిస్తుంది, సహజమైన ఎక్స్‌ఫోలియేట్‌ ఎలిమెంట్‌గానూ పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది ∙పాలు క్లెన్సర్‌గా పని చేస్తాయి ∙ముల్తానిమట్టి చర్మం మీద నిలిచిపోయిన మలినాలను తొలగిస్తుంది.పుచ్చకాయ రసంలో చర్మంలో నీటిశాతాన్ని తగ్గకుండా కాపాడడంతోపాటు తెల్లబరిచే గుణాలు కూడా ఉన్నాయి.

ఈ ప్యాక్‌ వేయడం వల్ల క్లెన్సింగ్, తేలికపాటి బ్లీచింగ్‌తోపాటు స్క్రబ్‌ చేసిన ఫలితాలు లభిస్తాయి. ప్రతిదీ నేచురల్‌ ప్రొడక్ట్‌ కావడంతో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు ∙పిగ్మెంటేషన్‌ (మంగు)తో బాధపడేవాళ్లు ఈ ప్యాక్‌ను తరచుగా అంటే నెలకు రెండు లేదా మూడుసార్లు వాడవచ్చు. ముల్తానిమట్టిని మినహాయించి తయారుచేసుకుంటే రెండు రోజులకొకసారి కూడా వాడవచ్చు. చర్మం మీద ఉన్న నల్లటి మచ్చలు పూర్తిగా మాయమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement