అర్ధాంగి జీవన సహచరి-6
నా భార్య పేరు సౌదామిని. మాకు ఒక కుమార్తె. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నందున అమ్మాయి ఒక్కతే చాలు అంటే కుటుంబ నియంత్రణ చేయించుకున్న త్యాగశీలి మా ఆవిడ. మేమిద్దరం చదువుకున్న నిరుద్యోగులం కాబట్టి చదువు విలువ తెలుసు కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా పాపను మంచి చదువు చదివించాలని నాకంటే తనకే ప్రతి విషయంలోనూ ప్రాధాన్యం ఇస్తుంది. ఆరేళ్ల క్రితం రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి ఆమె కోలుకుంది. మొదట గుండె ఆపరేషన్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో జరిగింది. అది పూర్తిగా మానకముందే మరొక ఉపద్రవం గొంతు క్యాన్సర్ రూపంలో వచ్చి ఆమెను ఛిన్నాభిన్నం చేసింది. మాకు దేవుడు ఎందుకు ఇంత శిక్ష విధించాడని ప్రతిరోజూ బాధపడేవాళ్లం.
కాని ఆమె వీటన్నింటిని జయించి, మా కోసమే... మేము ఏమైపోతామో నని రేయింబవళ్లు కళ్లలో ఒత్తులు వేసుకుని తను జీవిస్తూ మమ్మల్ని జీవించేలా చేస్తోంది. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని నేను కచ్చితంగా చెప్పగలను. ఒక మామూలు స్త్రీ తన కుటుంబం కోసం ఇంతకన్నా ఏం చేయగలదు. ఆమె చల్లగా ఉండాలని, మాతో చిరకాలం ఉండాలని దేవుడ్ని వేడుకొంటున్నాము.
మాది పెద్దలు కుదిర్చిన వివాహం అయినా అటు అత్తగారి తరపు నుంచి గాని, పుట్టింటి తరపు నుంచి కాని ఎటువంటి సహాయం, సహకారం లేనప్పటికీ... తిన్నా, తినకపోయినా గుట్టుగా సంసారం ముందుకు నడుపుతున్న నా భార్య అంటే నాకు, నా కూతురికి చాలా ఇష్టం. దేవుడు ఆమెకు నిండు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
- బి. శ్రీనివాసులు,
పోరుమామిళ్ల, కడప సౌదామిని
త్యాగశీలి మా ఆవిడ.
Published Sat, Feb 21 2015 11:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement