పరేషాన్ డీలర్! | party founds ration dealer | Sakshi
Sakshi News home page

పరేషాన్ డీలర్!

Apr 26 2014 4:17 AM | Updated on Mar 18 2019 7:55 PM

పరేషాన్ డీలర్! - Sakshi

పరేషాన్ డీలర్!

నందిగాం పంచాయతీ పరిధి పెంటూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొడ్డ కేశవరావు(కృష్ణారావు) బరితెగించారు.

నందిగాం, న్యూస్‌లైన్ : నందిగాం పంచాయతీ పరిధి పెంటూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొడ్డ కేశవరావు(కృష్ణారావు) బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ నేతలు అండగా ఉంటారనే బరితెగింపుతోనే ఆయన ఈ విధంగా చేశారని సమాచారం. ఆయన తీరుపై గ్రామస్తులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ పక్షపాతంతో నిత్యావసర వస్తువుల పంపిణీలో వివక్ష చూపితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా కేశవరావు బహిరంగంగా ప్రచారం నిర్వహించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని పలువురు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ  నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన ప్రస్తుతం మళ్లీ టీడీపీ శిబిరంలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement