Sakshi News home page

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 196 ఉద్యోగాలు

Published Wed, Aug 24 2016 3:09 AM

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 196   ఉద్యోగాలు - Sakshi

తపాలా విభాగం (పోస్టల్ డిపార్ట్‌మెంట్) తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టల్ డివిజన్లు/ యూనిట్లలో పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. కేవలం పదో తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసే ఈ నోటిఫికేషన్ ఉద్యోగార్థులకు సువర్ణావకాశమని చెప్పొచ్చు. సొంత ఊరు/ మండలం/జిల్లాలో అనువైన వేళల్లో పనిచేసే వెసులుబాటు పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ప్రత్యేకత. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
 
 మొత్తం పోస్టులు
 196 (ఆంధ్రప్రదేశ్-121, తెలంగాణ-75)
 
 రాష్ట్రాల వారీగా ఖాళీలు
 ఏపీలోని మొత్తం 121 ఖాళీల్లో పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలు 118. మెయిల్‌గార్డ్ ఉద్యోగాలు 3. తెలంగాణలోని మొత్తం 75 ఖాళీల్లో పోస్ట్‌మ్యాన్ పోస్టులు 70. మెయిల్‌గార్డ్ పోస్టులు 5.
 
 రీజియన్లు, రిజర్వేషన్ల వారీగా పోస్ట్‌మ్యాన్ వేకెన్సీ (ఏపీ)
 1.    కర్నూలు రీజియన్‌లో అనంతపురం, చిత్తూరు, కడప, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, తిరుపతి డివిజన్లు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం పోస్టులు 30 (ఓసీ-16, ఎస్సీ- 5, ఎస్టీ-4, ఓబీసీ-5). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-3.
 2.    విజయవాడ రీజియన్‌లో భీమవరం, ఏలూరు, గుడివాడ, గూడూరు, గుంటూరు, మచిలీపట్నం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తెనాలి, విజయవాడ డివిజన్లు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం పోస్టులు 55 (ఓసీ-32, ఎస్సీ-13, ఎస్టీ-8, ఓబీసీ-2). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-6.
 3.    విశాఖపట్నం రీజియన్‌లో అమలాపురం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం డివిజన్లు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం పోస్టులు 33 (ఓసీ-19, ఎస్సీ-8, ఎస్టీ-4, ఓబీసీ-2). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-3.
 ఠి    మూడు మెయిల్‌గార్డ్ పోస్టులనూ ఓసీలకే రిజర్వ్ చేశారు. ఇవి గుంతకల్, విజయవాడ, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో ఒక్కొకటి చొప్పున ఉన్నాయి.    
 
 రీజియన్లు, రిజర్వేషన్ల వారీగా పోస్ట్‌మ్యాన్ వేకెన్సీ (తెలంగాణ)
 1.    హైదరాబాద్ సిటీ రీజియన్‌లో హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, సికింద్రాబాద్, హైదరాబాద్ జీపీవో డివిజన్లు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం పోస్టులు 44 (ఓసీ-24, ఎస్సీ-8, ఎస్టీ-6, ఓబీసీ-6). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-4.
 2.    హైదరాబాద్ రీజియన్‌లో ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, ఖమ్మం డివిజన్లు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం పోస్టులు 26 (ఓసీ-17, ఎస్సీ-2, ఎస్టీ-0, ఓబీసీ-7). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-2.
 ఠి    ఐదు మెయిల్ గార్డ్ పోస్టుల్లో ఓసీ-4, ఎస్టీ-1.
 
 వేతనం
 రూ.5,200-20,200+గ్రేడ్ పే 2,000+అలవెన్సులు
 విద్యార్హత
 పోస్ట్‌మ్యాన్, మెయిల్‌గార్డ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత.
 
 వయో పరిమితి
 2016, సెప్టెంబర్ 4 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 
 ఎంపిక విధానం
 రాత పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్)  
 
 రాత పరీక్ష
 2 గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు (100 మార్కులు) జవాబులు గుర్తించాలి. ప్రశ్నలను పదో తరగతి స్థాయిలో ఇస్తారు. ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో 25 ప్రశ్నలు జీకే, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. పార్ట్-బీలో 25 ప్రశ్నలు గణితం నుంచి ఇస్తారు. పార్ట్-సీలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు, రెండో విభాగంలో తెలుగు భాష నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి.
 
 కనీస అర్హత మార్కులు
 విభాగాల వారీగా, మొత్తం మీద కనీస మార్కులు రావాలి. పార్ట్-ఏలో ఓసీలు 10 మార్కులు; ఓబీసీలు 9; ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. పార్ట్-బీ, పార్ట్-సీలోని ఒక్కో విభాగంలోనూ ఇదే విధంగా సాధించాలి. ఒక్కో విభాగంలో కనీస మార్కులతో పాటు మొత్తం మీద (100 మార్కులకు) ఓసీలకు 40 మార్కులు; ఓబీసీలకు 37; ఎస్సీ, ఎస్టీలకు 33 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు.
 
 దరఖాస్తు విధానం
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దీనికి ముందు అప్లికేషన్, ఎగ్జామ్ ఫీజులను చెల్లించాలి.
 
 అప్లికేషన్ ఫీజు:   రూ.100. అందరూ చెల్లించాలి.
 
 ఎగ్జామ్ ఫీజు:   రూ.400 (ఓసీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ పురుష అభ్యర్థులకు మాత్రమే)
 
 ఫీజు చెల్లింపు విధానం:
 అన్ని హెడ్ పోస్టాఫీసులతోపాటు ఎంపిక చేసిన కొన్ని సబ్ పోస్టాఫీసుల్లో ‘సునాయాసం హెడ్: పోస్ట్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ 2016’ పేరిట చెల్లించాలి. ఫీజు చెల్లింపును నిర్ధరిస్తూ 48 గంటల్లోపు మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి. ఎలాంటి హార్డ్‌కాపీలనూ సంస్థకు పంపాల్సిన అవసరంలేదు.  
 చివరి తేదీ:   2016, సెప్టెంబర్ 4
 వెబ్‌సైట్:   www.appost.in
 

Advertisement
Advertisement