సుప్రీం కోర్టులో రోజా పిటిషన్ | ysrcp mla roja files petition in supreme court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో రోజా పిటిషన్

May 28 2016 7:38 PM | Updated on Sep 2 2018 5:24 PM

నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోజా ఎన్నికను రద్దు చేయాలంటూ రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని తిరస్కరించాలంటూ రోజా హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు.

కాగా రాయుడు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు రోజా వేసిన పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. దీంతో రోజా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయుడి పిటిషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement