రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Sep 11 2016 10:52 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement