ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్ | Two inter- district robbers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్

Jul 29 2016 6:46 PM | Updated on Aug 30 2018 5:27 PM

వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బైరి రాములుది నల్గొండ జిల్లా ఆలేరు మండలం మందనపల్లి కాగా..శీల యాదగిరిది వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం మాదాపురం. నిందితులను శుక్రవారం ఆర్ ఎన్‌టీ రోడ్‌లోని బులియన్ మార్కెట్‌లో అరెస్ట్ చేశారు. వీరు హన్మకొండ, సుబేదారి, కేయూ, ఖాజీపేట, మడికొండ, వర్ధన్నపేట్, ఆత్మకూరు, జనగాం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు.

 

Advertisement
 
Advertisement
Advertisement