తెలంగాణ విద్యార్థుల్లో అపారమైన సృజన | telangana students very talanted | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యార్థుల్లో అపారమైన సృజన

Aug 26 2016 9:48 PM | Updated on Sep 4 2017 11:01 AM

తెలంగాణ విద్యార్థుల్లో అపారమైన సృజన

తెలంగాణ విద్యార్థుల్లో అపారమైన సృజన

సప్తగిరికాలనీ : తెలంగాణలోని విద్యార్థుల్లో ఎంతో సృజనాత్మకత దాగి ఉందని, సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 3 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిన్‌లాండ్‌ దేశానికి చెందిన దర్శకురాలు మాయా తెంగ్‌బర్గ్‌ అన్నారు.

సప్తగిరికాలనీ : తెలంగాణలోని విద్యార్థుల్లో ఎంతో సృజనాత్మకత దాగి ఉందని, సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 3 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిన్‌లాండ్‌ దేశానికి చెందిన దర్శకురాలు మాయా తెంగ్‌బర్గ్‌ అన్నారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌పై నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ అనంతరం అక్టోబర్‌ 3న విలియం షేక్‌స్పియర్‌  నాటకం ‘ది టెంపెస్ట్‌’ను తెలంగాణ భాషలో రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పలు మెలకువలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ కోమల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సూరేపల్లి సుజాత, వారాల ఆనంద్, కుమారస్వామి పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement