నేడు షారుఖ్‌ ఖాన్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌ | Shah Rukh Khan to be conferred with honorary doctorate | Sakshi
Sakshi News home page

నేడు షారుఖ్‌ ఖాన్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌

Dec 26 2016 3:53 AM | Updated on Apr 3 2019 6:34 PM

నేడు షారుఖ్‌ ఖాన్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌ - Sakshi

నేడు షారుఖ్‌ ఖాన్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌

హైదరాబాద్‌లోని మనూ విశ్వవిద్యాలయం షారుఖ్‌ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది.

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. సోమవారం మనూ ఆరో స్నాతకోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా షారుఖ్‌ ఖాన్‌ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో పాటు రేఖ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సంజీవ్‌ సరాఫ్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ ప్రకటించారు. ఉర్దూ భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకుగాను ఇద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను మనూ అందజేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement