Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Published Thu, May 26 2016 11:04 AM

road accident in vizianagaram one injured

కొమరాడ: మండలంలోని కూనేరు రామభద్రపురం గ్రామ సమీపంలో కారు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం జరిగింది. పెళ్లిగుడ్డివలస గ్రామానికి చెందిన ఎ.చిన్నప్ప కాలి నడకన కూనేరు వెళ్తుండగా.. రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో చిన్నప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడ్ని 108 వాహనంలో కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి ఎ. సాయికిరణ్ ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం ఎస్సై పి. దినకర్ వద్ద ప్రస్తావించగా, ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Advertisement
Advertisement