వృద్ధురాలిపై అత్యాచారం | rape on old women | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం

Sep 30 2016 12:04 AM | Updated on Sep 4 2017 3:31 PM

మండలంలోని నాగుపల్లిలో 60 ఏళ్ల ఓ వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బండి రమేష్‌ (35) బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు.

దమ్మపేట: మండలంలోని నాగుపల్లిలో 60 ఏళ్ల ఓ వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బండి రమేష్‌ (35) బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు. ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..సదరు వృద్ధురాలి భర్త, చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. పెద్ద కొడుకు పెళ్లయ్యాక అత్తారి ఊరిలో ఉంటున్నాడు. ఈమె గ్రామంలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గండుగులపల్లికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బండి రమేష్‌ నాగుపల్లిలో ఉంటూ పనిచేసుకుంటూ..బంధువైన బాధితురాలి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో అతను మద్యం సేవించి వృద్ధురాలి ఇంటికి వచ్చి..నిద్రిస్తున్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట ఎవరిౖకెనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం తాను పనిచేస్తున్న గ్రామంలోని కృష్ణారావు అనే వ్యక్తికి ఈ ఘటన గురించి ఏడుస్తూ చెప్పడంతో..ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు బాధిత వృద్ధురాలి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట సీఐ రవికుమార్‌ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement