తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు! | rains likely in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు!

Jul 24 2016 8:10 AM | Updated on Sep 4 2017 6:04 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. నేడు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement