పత్తికొండను రెవిన్యూ డివిజన్‌ చేస్తాం | pattikonda as revenue division | Sakshi
Sakshi News home page

పత్తికొండను రెవిన్యూ డివిజన్‌ చేస్తాం

Nov 7 2016 11:24 PM | Updated on Sep 4 2017 7:28 PM

డోన్‌తోపాటు పత్తికొండను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

–డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కృష్ణగిరి: డోన్‌తోపాటు పత్తికొండను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండల పరిధిలోని మన్నెకుంట, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాల్లో సోమవారం జరిగిన జనచైతన్యయాత్రల్లో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. డోన్‌ రెవిన్యూ డివిజన్‌లో పత్తికొండను కలుపకుండా పత్తికొండనే రెవిన్యూ డివిజన్‌ తప్పక చేస్తామన్నారు. పొదుపు సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, కేఈ శ్యాంబాబు, ఎంపీపీ సుంకులమ్మ, జడ్పీటీసీ లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement