రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు | One in injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Jan 31 2017 2:22 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు..

కొండమల్లేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. పీఏపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామపంచాయతీకి చెందిన రమావత్‌ రాములు తన బంధువులతో కలిసి బైక్‌పై కొండమల్లేపల్లి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వా హనం ఢీకొట్టింది.  రాములుకు తీవ్ర గాయాలు కావడంతో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement