పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempt to suicide by beating police | Sakshi
Sakshi News home page

పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Apr 20 2016 4:03 PM | Updated on Aug 21 2018 6:21 PM

పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Sakshi

పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసులు తనను అకారణంగా కొట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.

గిద్దలూరు(ప్రకాశం): పోలీసులు తనను అకారణంగా కొట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ... పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు భార్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారంటూ అనిల్ బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనే నిద్రమాత్రలు మింగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement