ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి | Injection reaction | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

Sep 29 2016 11:22 PM | Updated on Sep 28 2018 3:41 PM

కారంపూడి (గుంటూరు) : ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంపూడిలో గురువారం రాత్రి జరిగింది.

 ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి
 ఇంజక్షన్‌ , వ్యక్తి, మృతి
injuction, person, died
 Injection reaction
కారంపూడి (గుంటూరు) : ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంపూడిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా వున్నాయి. స్థానిక ఇందిరా నగర్‌ కాలనీలో ముత్యాలంపాటి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక మృతి చెందాడు. ఆయనను చూసేందుకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువు ముత్యాలంపాటి కృష్ణ తనకు నడుములో నొప్పి వస్తోందని చెప్పాడు. దీంతో బంధువులు దగ్గరల్లోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఇంజెక్షన్‌ ఇచ్చిన తర్వాత కృష్ణ మృతి చెందాడు. దీంతో దగ్గరి బంధువు మృతితో బాధపడుతున్న అక్కడివారికి మరొకరు మృతి చెందాడని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు ఎవరినీ నిందించలేదు. తప్పొప్పులు ఎంచలేదు. బాధను పంటి బిగువనే వుంచుకుని మృతదేహాన్ని స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడుకు తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement