భర్త కోసం బైఠాయింపు | Sakshi
Sakshi News home page

భర్త కోసం బైఠాయింపు

Published Thu, Jun 23 2016 8:18 AM

భర్త కోసం బైఠాయింపు - Sakshi

 న్యాయం చేయాలంటూ స్కూలు ముందు ఆందోళనకు దిగిన మహిళ
  మద్దతు పలికిన మహిళా సంఘాలు
  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
 
 మందస:  బాలిగాం మండల పరిషత్  ప్రాథమిక పాఠశాల ముందు బత్తుల సంధ్యారాణి అనే మ హిళ బుధవారం బైఠాయించారు. తన భర్త తనకు న్యాయం చేయడం లేదంటూ మహిళా సంఘాల మద్దతుతో ఆమె స్కూలు ముందు ఆందోళనకు దిగారు. వేరే మహిళ తో సంబంధం పెట్టుకుని తన భర్త తనను, పిల్లల్ని పట్టించుకోవడం లేదని ఆమె తెలి పారు. ఆమె తెలిసిన వివరాల మేరకు... మం దస మండలం బైరిసారంగపురం గ్రామానికి చెందిన బత్తుల మురళీమోహన్‌తో సంధ్యారాణికి 2004లో వివాహం జరిగింది. ఈ దం పతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

అ యితే రెండేళ్లుగా మురళీమోహన్ భార్యతో సరిగా ప్రవర్తించడం లేదు. తన భర్త ఇంటికి రావడం లేదని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని సంధ్యారాణి తెలిపారు. భ ర్త తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుని డబారు గ్రా మంలో కాపురం పెట్టినట్లు తెలిసిందని ఆమె చెప్పారు. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ సమయంలో పెద్దల సమక్షంలో తనకు న్యాయం చేసేందుకు తన భర్త ఒప్పుకున్నారని ఆమె తెలిపారు.

కానీ తర్వాత ఆయన వైఖరిలో మళ్లీ మార్పులు వచ్చాయని, తనను, పిల్లలను ప ట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మ హిళా సంఘాల సాయంతో ఆయన పనిచేస్తున్న పాఠశాల ముందు ఆందోళనకు దిగానని చెప్పారు. స్కూలు నుంచి బయటకు రావాలని నినాదాలు చేసినా రాకపోవడంతో పో లీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయమై సంధ్యారా ణి భర్త మురళీమోహన్ వద్ద ప్రస్తావించగా తన భార్య ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇదివరకే పెద్దల సమక్షంలో ఇచ్చిన తీర్పుకు ఆమె అంగీకరించిందని, తాను పెద్దలు చెప్పినట్లు న్యాయం చేయడానికి అంగీకరించానని, అనవసరంగా మళ్లీ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement