‘నువ్వు నాకు నచ్చలేదు.. చచ్చిపో’ | Husband forcing wife to commit suicide | Sakshi
Sakshi News home page

‘నువ్వు నాకు నచ్చలేదు.. చచ్చిపో’

Apr 21 2016 2:58 PM | Updated on Jul 27 2018 2:18 PM

‘నువ్వు నాకు నచ్చలేదు.. చచ్చిపో’ - Sakshi

‘నువ్వు నాకు నచ్చలేదు.. చచ్చిపో’

‘నల్లగా ఉన్నావు.. నువ్వు నాకు నచ్చలేదు.. నువ్వు చచ్చిపోతే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను’ అని ఓ వ్యక్తి ...

బంట్వారం (రంగారెడ్డి) : ‘నల్లగా ఉన్నావు.. నువ్వు నాకు నచ్చలేదు.. నువ్వు చచ్చిపోతే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను’ అని భార్యను  వేధింపులకు గురిచేయడమే కాక, నీ అంతట నువ్వు చచ్చిపోకపోతే నేనే చంపేస్తానంటూ ఓ భర్త హత్యాయత్నం చేశాడు. దీంతో బెదిరిపోయిన ఆ వివాహిత తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడితో పాటు సహకరించిన అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన రంగారెడ్డి జల్లా బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ప్రభుకు ధర్మాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి(22)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి లక్ష్మిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నువ్వు ఆత్మహత్య చేసుకోలేకపోతే నేనే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న సోదరుడు ఎల్లయ్యతో కలిసి ఆమెపై హత్యాయత్నం చేశాడు. దీంతో లక్ష్మి తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభు, ఎల్లయ్యలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement