ప్రేమికుడితో పెళ్లి కాదన్నందుకు..! | girl commits suicide for parents not accepting her love marriage | Sakshi
Sakshi News home page

ప్రేమికుడితో పెళ్లి కాదన్నందుకు..!

Jan 16 2016 9:36 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమికుడితో పెళ్లి కాదన్నందుకు..! - Sakshi

ప్రేమికుడితో పెళ్లి కాదన్నందుకు..!

ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

జమ్మికుంట(కరీంనగర్): ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శనివారం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న మిడిదొడ్డి రవళి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడిని ప్రేమించింది. అతనినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. వాళ్లు దీనికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవళి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement