భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నేతృత్వంలో భీమవరం విశ్వకవి పబ్లిక్ స్కూల్‌లో బుధవారం జిల్లా సబ్‌జూనియర్స్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య తెలిపారు.
నేడు సబ్ జూనియర్స్ చెస్ పోటీలు
Oct 26 2016 12:22 AM | Updated on Sep 4 2017 6:17 PM
భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నేతృత్వంలో భీమవరం విశ్వకవి పబ్లిక్ స్కూల్‌లో బుధవారం జిల్లా సబ్‌జూనియర్స్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, పోటీల్లో పాల్గొనే వారు 2001 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు వచ్చేనెల 4 నుంచి కడపలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తోట భోగయ్య చెప్పారు.
Advertisement
Advertisement