డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల | DSC-2014 suhedule released by minister ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల

May 17 2016 1:09 PM | Updated on Sep 4 2017 12:18 AM

డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల

డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.

విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.

డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 26 నుంచి  ప్రారంభమవుతుందని చెప్పారు. 28న నియామకపత్రాల జారీ, 29న వెబ్ కౌన్సిలింగ్, జూన్ 1న పోస్టింగ్లు ఇవ్వనున్నారు. మొత్తం 10,313 పోస్టులకు ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు గంటా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement