డ్రైవరే దొంగ | driver thief | Sakshi
Sakshi News home page

డ్రైవరే దొంగ

Nov 17 2016 11:25 PM | Updated on Sep 29 2018 5:34 PM

డ్రైవరే దొంగ - Sakshi

డ్రైవరే దొంగ

డ్రైవరే దొంగగా మారిన సంఘటన మండలంలోని చింతలయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు ట్రాక్టర్‌ను ఈ నెల 4న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

బుక్కపట్నం : డ్రైవరే దొంగగా మారిన సంఘటన మండలంలోని చింతలయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు ట్రాక్టర్‌ను ఈ నెల 4న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బాధితుడు బుక్కపట్నం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ యతీంద్ర తన సిబ్బందితో కలసి విచారణ ప్రారంభించి 10 రోజుల్లోనే కేసు ఛేదించినట్లు కొత్తచెరువు సీఐ శ్రీధర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.వివరాలు.. చింతలయ్యగారిపల్లి చెందిన శ్రీనివాసులు కొద్ది నెలల కిందట ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు.

ఈ నెల 4న రాత్రి ఇంటి వెనుక ఉన్న ట్రాక్టర్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన సూర్యచంద్ర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా ఉండేవాడు. గురువారం ఎస్‌ఐ, సిబ్బంది ముదిగుబ్బ రహదారిలో మఫ్టీలో నిఘా ముమ్మరం చేసి వాహనాల తనిఖీ చేస్తుండగా  గశికవారిపల్లి క్రాస్‌ వద్ద నలుగురు ఒకే స్కూటర్‌లో వస్తుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారిలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ సూర్యచంద్ర, శ్రీనివాసులు, ప్రభాకర్, శంకర్‌తో కలిసి ట్రాక్టర్‌ను దొంగలించామని ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. ట్రాక్టర్‌ను దొంగలించి తనకల్లు మండలం తురకవాండ్లపల్లికి చెందిన హనుమంతరెడ్డికి విక్రయించేకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రూ.30 వేలు, రాడ్, స్వానర్, కారంపొడి పొట్లాలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీధర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement