ముద్రగడపై చినరాజప్ప ఫైర్ | Chinna Rajappa takes on Mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడపై చినరాజప్ప ఫైర్

Aug 23 2016 5:04 PM | Updated on Jul 11 2019 8:34 PM

కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప నిప్పులు చెరిగారు.

విజయవాడ : కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప నిప్పులు చెరిగారు.  మంగళవారం విజయవాడలో చినరాజప్ప మాట్లాడుతూ... ముద్రగడతో కాపు జాతికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పదవి ఉంటే ఒకలా... లేకుంటే మరోలా మాట్లాడటం ముద్రగడ నైజం అని ఆయన ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చినరాజప్ప మరోసారి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement