బాలుడిపై లైంగిక దాడి..హత్య | boy abducted, killed in moinabad | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగిక దాడి..హత్య

Dec 5 2016 8:29 AM | Updated on Jul 29 2019 5:43 PM

బాలుడిపై లైంగిక దాడి..హత్య - Sakshi

బాలుడిపై లైంగిక దాడి..హత్య

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో దారుణం జరిగింది.

మొయినాబాద్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో దారుణం జరిగింది. చిలుకూరు ఇంద్రారెడ్డినగర్ కాలనీకి చెందిన మహేందర్ కుమారుడు రోహన్‌కుమార్(9)ను ఆదివారం సాయంత్రం అదే కాలనీకి చెందిన సంతోష్(24) కిడ్నాప్ చేశాడు.

అనంతరం బాలుడిని రాజీవ్‌గృహకల్ప భవనంపైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపైన అతడిని గొంతుకోసి చంపి నీళ్ల ట్యాంకులో పడేశాడు. అయితే, స్థానికులు అనుమానించి అతడిని నిలదీయగా దారుణాన్ని అంగీకరించాడు. దీంతో వారు చితకబాది అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిది మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద గ్రామం అని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement