బోనం.. వైభోగం.. | bonam | Sakshi
Sakshi News home page

బోనం.. వైభోగం..

Jul 22 2016 12:00 AM | Updated on Oct 1 2018 6:33 PM

బోనం.. వైభోగం.. - Sakshi

బోనం.. వైభోగం..

బోనం అంటే భోజనం అని అర్థం. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ ఇలా అమ్మల కన్న అమ్మలకు కుండల్లో పరమాన్నం వండుతారు. తర్వాత కుండలను కుంకుమ, పసుపుతో అలంకరిస్తారు. బోనంపై దీపం, చుట్టూ వేప కొమ్మలు కట్టుతారు. ఇలా గ్రామంలోని మహిళలు అందరూ బోనాలను చేసి, సమూహికంగా గుడికి బయలుదేరుతారు. బోనాల యాత్ర ముందు శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి.

బోనం అంటే భోజనం అని అర్థం. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ ఇలా అమ్మల కన్న అమ్మలకు కుండల్లో పరమాన్నం వండుతారు. తర్వాత కుండలను కుంకుమ, పసుపుతో అలంకరిస్తారు. బోనంపై దీపం, చుట్టూ వేప కొమ్మలు కట్టుతారు. ఇలా గ్రామంలోని మహిళలు అందరూ బోనాలను చేసి, సమూహికంగా గుడికి బయలుదేరుతారు. బోనాల యాత్ర ముందు శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. డోలు వాయిద్యాలు, గజ్జెల మోత సంబురాన్ని అంబరాన్నంటేలా చేస్తాయి. అమ్మాబైలñ ల్లినాదో... తల్లిబైలెల్లినాదో... అంటూ పాటలు జనాలను భక్తి భావంతో పాటు ఒకింత ఉద్వేగాలకు లోను చేస్తాయి. నియోజకవర్గంలోని ప్రజలు బోనమెత్తారు. గురువారం దహెగాం మండలం ప్రజలు గ్రామ శివారులోని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. – దహెగాం 
 

Advertisement
 
Advertisement
Advertisement