సినీనటుడు ఆదిత్య సందడి | Actor Aditya Om Promotion Work in Vizianagaram | Sakshi
Sakshi News home page

సినీనటుడు ఆదిత్య సందడి

Jul 20 2016 1:06 AM | Updated on Aug 17 2018 2:27 PM

సినీనటుడు ఆదిత్య సందడి - Sakshi

సినీనటుడు ఆదిత్య సందడి

పట్టణంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం హీరో ఆదిత్యతో పాటు సినిమా టీమ్ సందడి చేసింది. ప్రమోషన్ వర్క్‌లో భాగంగా పట్టణమంతా కలియతిరిగింది.

 విజయనగరం టౌన్ : పట్టణంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం హీరో ఆదిత్యతో పాటు సినిమా టీమ్ సందడి చేసింది. ప్రమోషన్ వర్క్‌లో భాగంగా పట్టణమంతా కలియతిరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహారాజా కళాశాలలో విద్యార్థులతో హీరో ఆదిత్య మమేకమయ్యారు.  గతంలో తాను లాహిరి..లాహిరి..లాహిరి చిత్రంలో సైడ్ హీరోగా వేసి ప్రస్తుతం ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రంలో హీరోగా నటిస్తున్నానని తెలిపారు. హీరోను చూసేందుకు కళాశాలల విద్యార్థులు ఉత్సాహాన్ని చూపారు. పట్టణానికి చెందిన మున్నా మైఖేల్ డ్యాన్స్ అకాడమీ నిర్వహకుడు మున్నా, విశాఖకు చెందిన వెన్నెల ఈవెంట్స్ నిర్వాహకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం టీమ్ తదితరులు పలు ప్రాంతాల్లో పర్యటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement