87 సిలిండర్లు స్వాధీనం | 87 cylinders siezed | Sakshi
Sakshi News home page

87 సిలిండర్లు స్వాధీనం

May 3 2017 10:31 PM | Updated on Sep 5 2017 10:19 AM

87 సిలిండర్లు స్వాధీనం

87 సిలిండర్లు స్వాధీనం

తణుకు టౌన్‌: తణుకులో డివిజనల్‌ సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో 87 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు డీటీ డి.అశోక్‌వర్మ తెలిపారు.

తణుకు టౌన్‌: తణుకులో డివిజనల్‌ సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో 87 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు డీటీ డి.అశోక్‌వర్మ తెలిపారు. బుధవారం కొవ్వూరు డివిజనల్‌ ఏఎస్‌ఓ ఆనందబాబు ఆధ్వర్యంలో తణుకులోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బడ్డీ వ్యాపారులు వినియోగిస్తున్న గ్యాస్‌ సిలిండర్లను తనిఖీ చేశామన్నారు. 87 గృహావసరాల సిలిండర్లను గుర్తించి 50 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వీటిలో 38 ఇండేన్‌ గ్యాస్, 49 హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని చెప్పారు. వీఆర్‌ఓలు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement