ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద కలకలం! | Woman Committed Suicide At Sanat Nagar In Hyderabad | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..!

Feb 6 2019 11:26 AM | Updated on Feb 6 2019 11:39 AM

Woman Committed Suicide At Sanat Nagar In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన మహిళను సనత్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన మంగతాయారుగా గుర్తించారు. ఆమె భర్త భీమేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలోని మొగలిపాలెంకు చెందిన భీమేశ్వరరావు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎస్‌ఆర్‌టీ కాలనీలో నివాసముంటున్నారు. కుంటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement