కీచక మామ కోడలిపై.. | Uncle Molestation of Daughter in Law in Karnataka | Sakshi
Sakshi News home page

కీచక మామ

May 25 2019 11:23 AM | Updated on May 25 2019 11:23 AM

Uncle Molestation of Daughter in Law in Karnataka - Sakshi

ఇంటి బయటకు లాక్కొచ్చి   దుస్తులు చింపి అవమానించారు.

కర్ణాటక,కృష్ణరాజపురం : కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కీచకమామ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కోణనకుంటెలో వెలుగు చూసింది. 2014లో ఓ యువతి మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమైన కుమార్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు కొద్ది రోజులకే భర్త కుమార్‌ తండ్రి పళని నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని భర్త కుమార్‌ చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది.

దీంతో దంపతులు  కోణనకుంటెలో వేరు కాపురం పెట్టారు. అయితే రెండు నెలల క్రితం ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో  కుమార్‌ ఇంటికి రావడం మానేశాడు. ఈ తరుణంలో పళని భార్య సరస్వతి గురువారం ఆ యువతి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి  గొడవ పడింది. ఆమెను ఇంటి బయటకు లాక్కొచ్చి   దుస్తులు చింపి అవమానించారు. లత ఫిర్యాదు మేరకు కోణనకుంటె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement