దేవుడా.. ఇంత ఘోరమా!

Three Killed In Road Accident In Inkollu - Sakshi

ఇంకొల్లులో రోడ్‌ టెర్రర్‌

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌

ముగ్గురు మృతి

ఒకరి దేహం రెండు ముక్కలైన వైనం

ఇంకొల్లు : కలలో కూడా ఊహించలేనంతగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతదేహం రెండు ముక్కలుగా ఛిద్రం అయింది. ఇంకొల్లులోని పావులూరు రోడ్డు టీటీడీ కల్యాణ మండపం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్రోణాదుల నుంచి మిర్చి లోడుతో ఇంకొల్లుకు టాక్టర్‌ వస్తోంది. ఇదే  సమయంలో పావులూరు గ్రామానికి చెందిన ముగ్గురు బైకుపై ఇంకొల్లు నుంచి పావులూరుకు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు ఎగిరపడ్డారు.

బట్టు శ్రీను (45) మృతదేహం రెండు ముక్కలై అవయవాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. బట్టు శ్రీనుకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. గాలి శ్రీను (40)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చుండూరి మరియదాసు (28)కు చిన్న పాప ఉంది. సంఘటన తెలుసుకున్న ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు, ఎస్సై వి.రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రించారు. సంఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేషగిరిరావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top