బాలికకు పూజారి లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

బాలికకు పూజారి లైంగిక వేధింపులు

Published Sat, Apr 27 2019 9:55 PM

Priest molested 8 Year old Girl - Sakshi

టీ.నగర్‌: బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఓ పూజారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కోయంబత్తూరు సమీపంలోని కోవిలంపాళయం ప్రాంతానికి చెందిన దండపాణి (61) కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అదే ప్రాంతంలోని ఒక ఆలయంలో పూజారిగాను ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలిక దండపాణి దుకాణానికి చాక్లెట్‌ కొనుక్కునేందుకు వెళ్లింది. ఆ సమయంలో దండపాణి బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక ఏడుస్తూ బయటికి పరుగుతీసింది. దీని గురించి బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దండపాణిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరిచి జైలులో నిర్బంధించారు.

Advertisement
Advertisement