పెళ్లి చేసుకో.. లేదంటే కిడ్నాప్‌ చేస్తా! | Man held for stalking Sachin Tendulkar's daughter Sara | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకో.. లేదంటే కిడ్నాప్‌ చేస్తా!

Jan 8 2018 2:46 AM | Updated on Oct 8 2018 3:07 PM

Man held for stalking Sachin Tendulkar's daughter Sara  - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారాను వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. నిందితుడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన దేవ్‌ కుమార్‌(32)గా గుర్తించారు. సచిన్‌ ఇంటి ల్యాండ్‌లైన్‌ నంబర్‌ను ఎలాగో సంపాదించిన దుండగుడు.. గత కొద్ది రోజులుగా ఫోన్‌ చేసి సారాను వేధిస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు తనను పెళ్లి చేసుకోకుంటే కిడ్నాప్‌ చేస్తానని సారాను బెదిరించాడన్నారు.

ఈ విషయమై ముంబైలోని బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో సచిన్‌ కుటుంబం ఫిర్యాదు చేయడంతో కోల్‌కతా పోలీసుల సాయంతో ఫోన్‌ ట్రేస్‌ చేసి కుమార్‌ను పట్టుకున్నామన్నారు. ‘ఓ మ్యాచ్‌లో పెవిలియన్‌లో కూర్చుని ఉన్న ఆమె(సారా)ను టీవీలో చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయా. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెతో మాట్లాడేందుకు వాళ్లింటికి 20 సార్లు ఫోన్‌ చేసుంటా’ అని కుమార్‌ పోలీసులకు తెలిపాడు. కుమార్‌కు మతిస్థిమితం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement